ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యం ఏమిటో చెప్పాలంటూ నెటిజన్లకు మూడు ఆప్షన్లను ఇచ్చారు. అందులో ‘కేసుల మాఫీ కోసమా ?’ లేక ‘బాబాయ్ హత్య కేసు కోసమా? ‘ లేక ‘ప్రత్యేక హోదా తేవడం కోసమా?‘ అంటూ మూడు ప్రశ్నలని సంధించారు.
Advertisements
లోకేష్ నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 5 వేల 300కు పైగా మంది పాల్గొన్నారు. ఇందులో 69శాతం మంది కేసులు మాఫీ కోసమంటూ రిప్లై ఇవ్వగా.. 6 శాతం మంది నెటిజన్లు బాబాయ్ హత్య కేసు కోసమంటూ సమాధానం ఇచ్చారు. మరో 25శాతం మంది ప్రత్యేక హోదా కోసమంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.