విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీతో పాటు ఏపీలోని అన్ని పార్టీలు కూడా మోదీ ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొసాగుతున్న ఉద్యమానికి హీరో నారా రోహిత్ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోంది. ఆంధ్రుడా మేలుకో. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ, స్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మనం సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగిలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం.’’ అంటూ నారా రోహిత్ పిలుపునిచ్చారు.
కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు.(1/3)
— Rohith Nara (@IamRohithNara) February 21, 2021