నారగొని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
ప్రతి సంవత్సరం రూ. 2800 కోట్లు రైతులు కాని వారికి, పంట పండని భూమికి రైతు బంధు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో గుట్టలు,లే అవుట్లు కూడా ఉన్న భూమి ఉంది. తెలంగాణలో కోటి యాబై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
ఎకరాకు రూ. 10,000 లాగా వ్యవసాయ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి మాత్రమే సాగు అవుతుంది. మొత్తం రైతు బంధు పేర రైతులకు ఇస్తున్నట్లు చెబుతున్న పదిహేను వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారు.
ఇందులో పంట పండని భూమి 28 లక్షల ఎకరాలు. రూ. 2800 కోట్లు ప్రతి సంవత్సరం ప్రజల సొమ్ము కేవలం ఓట్ల కోసం వృథాగా రైతు కాని వారికి, పంట పండని భూమికి రైతు బంధు ఇస్తున్నారు. ఇందులో 25 ఎకరాలకు పైబడి భూమి ఉన్న వారు తొంభై ఐదు వేల మంది ఉన్నారు. వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఇతర వ్యాపార సంపన్నులు.. వీరు పొలం దున్ని వ్యవసాయం చేసే రైతులు కారు.
ఇటు రైతు బంధు అటు కౌలు తీసుకుంటున్నారు.. కొందరు కౌలు కు కూడా ఇవ్వరు. మరి కొందరు మామిడి, జామ లాంటి తోటలు పెట్టుకున్నారు. ఫామ్ హౌస్ లు కట్టుకున్నరు. కేసీఆర్, కేటీఆర్ మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవిత, సంతోష్ రావు,హరీష్ రావు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఇతర రాజకీయ పార్టీల నాయకులు రేవంత్ రెడ్డి ,ఈటెల రాజేందర్, వివేక్ వెంకటస్వామి.. రైతు బంధు తీసుకుంటున్న వారిలో ఉన్నారు.
ఉంటే వారి పేర ఉన్న భూమి పై లేదంటే, బినామీల పేర ఉన్న భూమి పై, ఇందులో భూమి లేని ఉన్నా రైతు బంధు తీసుకొని వారు ఉంటే పొరపాటుకు చింతిస్తున్నాను. రైతు బంధు పేర సంపన్నులకు వేల కోట్లు ప్రభుత్వం అప్పనంగా పంచుతోంది. వివిధ పన్నుల ద్వారా ప్రజలు కట్టిన పైసలు వృథా చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది అందరు ఆలోచించాలి.
పంట పండించే కౌలు రైతులు అన్యాయం అవుతున్నారు అన్నది నిజం. నిజంగా రైతు బంధు మంచి స్కీమ్. పంట పండించే రైతుకు పంట పండే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. ప్రభుత్వాన్నీ ప్రతి పక్షాలు ఈ విషయంలో నిలదీయాలి.కొస మెరుపు ఏంటంటే ఇప్పుడు మునుగోడు లో పోటీ చేస్తున్న రాజ గోపాల్ రెడ్డి గారు రైతు బంధు నాకు అక్కర లేదని అసెంబ్లీ లో చెప్పడం జరిగింది
మిగతా ఎమ్మెల్యేలు రైతు బంధు వద్దని చెప్పలేదు.. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. ఇంత గొప్ప నాయకులను ఎన్నుకున్నారు తెలంగాణ ఓటర్లు. ఒక్క సారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మంచి నాయకులకు ఓటేయాలని కోరుకుంటున్నాను.రైతుల చేతుల నుండి భూమి ప్రతి సంవత్సరం లక్షల ఎకరాలు వ్యాపారస్తుల, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళుతుంది.
వివిధ అవసరాలకు అంటే పిల్లల చదువుల కోసం, దవఖాన ఖర్చుల కోసం, పిల్లల పెళ్లి లకోసం, నూతన ఇంటి నిర్మాణం కోసం రైతులు భూములు అమ్ముకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క రైతు కూడా ఒక్క ఎకారం భూమి కొనడం జరగడం లేదు పైగా ఉన్న భూమిని నిలబెట్టుకోవడం కష్టం అవుతోంది.