నారగొనీ ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
రాజ్యాంగం రాయడం అంటే లిక్కర్ షాప్ ల కాడ తాగుబోతులకు పెన్ను పేపర్ ఇచ్చి రాయించేధి కాదు. ప్రపంచ మేధావి తన విజ్ఞానాన్ని రంగరించి రాసిన గొప్ప రాజ్యాంగం ప్రపంచ మేధావుల ప్రపంచ దేశాల మన్నలను పొందింది. కొత్తగా రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని కోరుకునే వారు అధి ఎట్లా ఉండాలో వివరిస్తే బాగుండేది.
తెలంగాణ ఏర్పడింది అంటే రాజ్యాంగం అనుమతించింది కాబట్టే వీలైంది కేసీఆర్. అలాగే నువ్వు ముఖ్య మంత్రి కావడాన్ని ఆమోదించింది. ఏ గ్రహణం పట్టిందో గానీ కేసీఆర్ నోటినుండి కొత్తగా రాజ్యాంగం రాయాలనే మాట రావడాన్ని తెలంగాణలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు.
వారి పార్టీకీ నష్టం కూడా జరుగుతుంది. మన 119 ఎమ్మెల్యే లు రాజ్యాంగాన్ని కాదు కదా అందులో 119 వాక్యాలు అయినా రాయగలరా? కనీసం ఒకరో ఇద్దరో తప్ప మిగితా ఎమ్మెల్యే లు రాజ్యాంగాన్ని చదివినారా? కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాలలో రాజ్యాంగం ఉన్నదా? కొత్త రాజ్యాంగం రాయడానికి ముందు దేశ సంపదను కులాలకు మతాలకు అతీతంగా అందరికి సమానంగా పంచాలి పంచుతారా?
ఎన్నికలలో పైసలు పంచి ఓట్లు కోనుకునే వారు నేరస్థులకు అవినీతి పరులకు ఎమ్మెల్యే,ఎంపీ టిక్కెట్లు ఇచ్చే వారు సామాజిక న్యాయం పాటించాలనే జ్ఞానం లేని వారు కొత్తగా రాజ్యాంగాన్ని రాసుకొని తద్వారా ఇంకా తనకు ఏమి తక్కువయిందని ఏమీ కోరుకుంటున్నారు, జనాభా పరంగా అన్ని కులాల వారికి సమానంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలి అని డిమాండ్ చేయగలరా? ఈ డిమాండు ను నిజాయితీగా ఒప్పు కుంటారా?ఇన్నాళ్లు బడుగు భలహీన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని పూడ్చగలరా? మాంసం తినే తోడేళ్ళు మేకల ఆవుల రక్షణను కోరుకుంటాయా? అన్నది మిలయన్ డాలర్ల ప్రశ్న.