ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రైతులకు మద్ధతుగా చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను విజయవాడలో అరెస్ట్ చేశారు. లోకేశ్ ను తోటవల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్టు సమాచారం. లోకేశ్ తో పటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని బెంజ్ సర్కిల్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మాజీ మంత్రి నారా లోకేశ్ అరెస్ట్