ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కానీ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆయన ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానంటూ లోకేశ్‌తో అచ్చెన్న అన్నారు.