శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గాఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తమిళ నాట ఘన విజయం సాధించింది. పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను కలైపులి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తోంది. కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం నటించారు. కాగా సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. కుటుంబ సభ్యులతో నారప్ప దిగిన ఈ స్టిల్ ప్రస్తుతం సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.