తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం నరసన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందని లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గ్రామ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. గ్రామానికి వచ్చిన నిధుల్లో ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
తక్షణమే ఈ పాలక వర్గాన్ని మొత్తం సస్పెన్షన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులైన వారికి ఇళ్లు ఇప్పించకుండా.. వారి అనుకూలంగా ఉన్నవారికి ఇళ్లను ఇప్పిస్తున్నారని అంటున్నారు. తిరిగి వాళ్లను ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.
వేరే పార్టీలకు చెందిన వారికి ఇళ్లు ఇవ్వమని అంటున్నారని చెబుతున్నారు గ్రామస్తులు. గ్రామంలో గ్రామసభ పెట్ట ఏడాది అయిపోయిందన్నారు. స్మశాన వాటికకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారన్నారు.
సీసీ రోడ్లకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మాయం చేశారని పేర్కొన్నారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు అయిన వాళ్లను డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారు గ్రామస్తులు.