శత్రుదేశాలతో భవిష్యత్తులో భారత్ కు ప్రమాదం పొంచి ఉందన్నారు భారత సైనిక దళాధిపతి ఎంఎం నరవణె. అందుకు సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అందకు భారత సైనికులు అందకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
పాకిస్థాన్, చైనా పేర్లు ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే.. వినూత్నమైన భద్రతా సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఓ ఆన్ లైన్ సెమినార్ లో ప్రసంగించారు నరవణె.
భవిష్యత్తులో భారత్ కు ఎదుర్కోనున్న సంఘర్షణలను ట్రైలర్ ల రూపంలో చూస్తున్నామని అని నరవణె పేర్కొన్నారు. ఉత్తర సరిహద్దులో ఏర్పడ్డ పరిస్థితులు.. మనకు మరింత సమర్థమైన సైన్యం కావాలన్న అవసరాన్ని గుర్తుచేశాయని తెలిపారు.
దేశానికి శత్రువులు తలపెడుతున్న ముప్పుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉదురైనా డీకొనేందుకు సైనికులు సిద్దంగా ఉండాలన్నారు నరవణే.