ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోని పారిశ్రామికవాడలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ గొడౌన్ లో మెథాపాటెమిన్ అనే డ్రగ్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్, వెంకటరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఒంగోలు కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తూ… హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
చెన్నైలో ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తో దొరకటం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే గత రాత్రి చెన్నై నుండి వచ్చిన పోలీసులు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇక డ్రగ్స్ తయారుచేస్తున్న గొడౌన్ వద్దకు చేరుకున్న ఒంగోలు పోలీసులు,ఆర్డీవో,తహసీల్దార్ లు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.