మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు స్పీడు పెంచారు. ఈ కేసులో భాగంగా నార్కోటిక్ పోలీసులు తాజాగా మరో మాదక ద్రవ్యాలను సప్లై చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో న్యూఇయర్ టార్గెట్ గా మాదకద్రవ్యాలు సరఫరా చేసిన మోహిత్ ను నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబైకి చెందిన మోహిత్ పలువురు పారిశ్రామిక వేత్తలకు, సినీ ప్రముఖులకు కొకైన్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఓ పబ్ లో మోహిత్ కొకైన్ సప్లై చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మోహిత్ పై గతంలో రామ్ గోపాల్ పేట్ పీఎస్ లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు మోహిత్ ను విచారణ చేస్తున్నారు. మరోవైపు గోవాకు చెందిన జాబితాలో మాదకద్రవ్యాల వినియోగదారుల సమాచారం కూడా సేకరిస్తున్నారు.
అతడితో పాటు నార్కోటిక్ విభాగం పోలీసులు మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతని కాంటాక్ట్ లిస్ట్ ను కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. అయితే మోహిత్ కాంటాక్ట్ లిస్ట్ లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.