క్వాడ్ సమావేశం అనంతరం ప్రధాని మోడీకి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. సమావేశం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో కలిసి మెట్లు దిగుతుండగా ఈ ఫోటోను తీశారు.
అందులో అందరి నేతల కన్నా మోడీ ముందు ఉన్నారు. ఆ ఫోటోలో ప్రధాని మోడీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఫోటోను బీజేపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నాయి. దీంతో ఫోటో వైరల్ అవుతోంది.
ప్రధాని మోడీపై బీజేపీ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో ఒక ఫోటోను పోస్టు చేశారు. ‘ప్రపంచాన్ని మోడీ నడిపిస్తున్నారు. ఒక ఫోటో వేయి మాటలతో సమానం’ అని ట్వీట్ చేశారు.
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా మోడీ ఫోటోను షేర్ చేస్తూ… ‘విశ్వ గురు భారత్’ అని రాసుకొచ్చారు. ప్రపంచ దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోందన్న అర్థంతో ఈ ట్వీట్ ను చాలా మంది షేర్ చేస్తున్నారు.