పవిత్ర,నరేష్ రిలేషన్ గురించి తలొకరు తలోమాట అనుకున్నారు. అవాకులు చవాకులు పేలిన వాళ్ళమీద ప్రవిత్ర,నరేష్ లు కేసులు కూడా పెట్టారు. వారిని పవిత్ర దంపతులుగా గుర్తించాలని తాపత్రయ పడ్డారు.
ఈ నేపథ్యంలో సదరు జంట పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.అయితే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి, పవిత్రకు రెండో పెళ్లి. ఈ ఇద్దరు కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.
చాలా సార్లు ఈ జంట మీడియా కంట పడ్డారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజు పెళ్లి చేసుకోబోతున్నాం అని ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అలాగే లిప్ లాక్ పెట్టుకొని చెవులు కొరుక్కునే వాళ్ళకు షాక్ ఇచ్చారు. కొద్ది రోజుల తరవాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
రీసెంట్ గా ఈః ప్రేమ పక్షులు చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అలాగే పెళ్లి అయిన వెంటనే దుబాయ్ కూడా వెళ్లారని..అక్కడ చెట్టాపట్టాలేసుకు తిరిగారు కూడా. అయితే ఇదంతా నిజం కాదని.. ఓ సినిమా కోసం అని అన్నారు.
తాజాగా అదే నిజం చేస్తూ.. మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మళ్లీ పెళ్లి అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవిత్ర ముగ్గువేస్తుండగా.. నరేష్ పక్కన చూస్తూ ఉన్న పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.