పెళ్లి అనేది స్వర్గం లో దేవుడు నిర్ణయిస్తాడు అని అంటారు. అంతటి ప్రాముఖ్యత ఆ మూడు ముళ్ల బంధానికి ఉంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తూ ఈ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో వివాహ బంధాలు బలహీన పడుతున్నాయి. ఒక్కొక్కరు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇష్టం ఉంటే కలిసి ఉంటున్నారు లేదంటే అప్పటికీ కూడా విడిపోతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే ఎంతో మంది పెళ్లి చేసుకున్న తక్కువ కాలంలోనే భార్యకు విడాకులు ఇస్తున్నారు. ఆ వెంటనే మరో పెళ్లి ని చేసుకుంటున్నారు. అక్కడితో కూడా ఆగట్లేదు. అలా ఇద్దరు ముగ్గురు వరకు తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు తాజాగా నటుడు నరేష్ నాలుగో పెళ్లి కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ విజయనిర్మల కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నరేష్. కెరీర్ మొదటి లో హీరోగా నటించి అందరిని మెప్పించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా హీరో హీరోయిన్స్ కు తండ్రి, మామ, బాబాయ్ వంటి కీలక పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు.
పెళ్లి తరువాత నయన్ కొత్త కండిషన్స్…సమంత ఎఫెక్ట్ ?
అయితే గత కొంత కాలం నుంచి చిత్ర పరిశ్రమకు చెందిన నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు సహజీవనం చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది.
అలాగే మరో ఆసక్తికర వార్త కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ఈ మేరకు ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక పవిత్ర, లోకేష్ కు అధికారికంగా విడాకులు మంజూరు కాకపోవడంతో వీరి పెళ్లికి బ్రేక్ పడిందని లేదంటే వీలైనంత త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
మరో పాన్ ఇండియా సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..!