సీనియర్ నటుడు నరేష్ వృత్తి జీవితం జోరుగానే సాగుతున్నా..వ్యక్తి గత జీవితంలో మాత్రం పెళ్ళిగోలల పరంపర సాగుతుంది. ప్రస్తుతం ఆయనకు మూడో పెళ్ళి విడాకుల టెన్షన్ తోపాటు, నాలుగో పెళ్ళి అటెన్షన్ కూడా నడుస్తుంది.
అతని జీవితంలోకి రాబోతున్న నాలుగో భార్య పవిత్ర, విడాకులివ్వనంటూ మొండి పట్టు పడుతున్న రమ్య కంటే ముందు నరేష్ రేఖ సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.రేఖ ప్రముఖ రచయిత దేవులపల్లికృష్ణశాస్త్రి గారి మనవరాలు. అంతే కాకుండా బుజ్జాయి రచయిత అయిన సుబ్బరాయ శర్మ కూతురు కావడం విశేషం.
రేఖ సుప్రియ తండ్రి సుబ్బరాయ శర్మ విజయనిర్మలకు సన్నిహితులు కావడంతో నరేష్ తో సంభందం కుదిరింది. ఇక పెళ్లి తరవాత నరేష్ రేఖ సుప్రియలకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో పెద్ద కుమారుడు నవీన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు తేజకు ఆటిజం అనే మానసిక సమస్య ఉంది.దీని వల్ల పిల్లలు శారీరకంగా పెద్దవాళ్లు అయినప్పటికీ మానసికంగా మాత్రం ఎదుగుదల ఉండదు.
చిన్న కొడుకు తేజకు ఆటిజం సమస్య ఉన్న కారణంగా నరేష్ తన భార్య రేఖకు విడాకులు ఇచ్చాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక విడాకుల తరవాత నవీన్ బాధ్యతలు నరేష్ చూసుకుంటున్నాడు.
అదేవిధంగా రేఖ సుప్రియ, తేజ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇక రేఖ సుప్రియ తేజ లాంటి కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి ఖర్చులు భరిస్తున్నారు. అంతే కాకుండా ఓ ట్రస్ట్ ను ప్రారంభించి ఆటిజం తో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రలకు కోచింగ్ కూడా ఇస్తున్నారు.