నరేష్ సీనియర్ రిపోర్టర్
వలస కూలీలను రైల్లలో సొంత రాష్టాలకు తరలించేందుకు కేంద్రం 85 శాతం భరిస్తుంది..మిగిలిన 15 శాతం రాష్టం భరిస్తుందో, లేక కూలీల నుంచి వసూలు చేస్తుందో మీ ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసిన నేపధ్యంలో..85 శాతం కిరాయిలను కేంద్రం భరిస్తుందని..గొప్ప దాత్రుత్వం ప్రదర్శిస్తుందని అంతా భావిస్తాం. కాని అలా జరగడం లేదు. ఓ సారి శ్రామిక్ రైల్ల రేట్లను చూస్తే మనకే అర్దమవుతుంది. ఉదాహరణకు ముంబాయి నుంచి లక్నోకు కూలీను తరలించడానికి ఒకొక్కరి వద్ద రైల్వే శాఖ 479 రూపాయలు వసూలు చేసింది. కాని సాధరణ రోజుల్లో అసలు కిరాయి 630 రూపాయలు మాత్రమే. అంటే కేంద్రం భరిస్తుంది కేవలం 151 రూపాయలే. శాతాల్లో చూస్తే అది 5 శాతం కన్నా తక్కువ. అలాంటి 85 శాతం రిబెట్ ఇస్తున్నామని చెప్పడం దారుణం. కోయంబత్తూరు లోని త్రివెండీ రోడ్ స్టేషన్ నుంచి గోరఖ్ పూర్ వరకు సాధరణ టికెట్ ధర 844 రూపాయలు, అదే శ్రామిక్ రైల్లో 745 వసూలు చేస్తున్నట్లు వలస కూలీ చేతిలో నలిగిన టికెట్ ను చూస్తే తెలుస్తుంది. కేవలం వంద రూపాయలు తగ్గించి దానికి 85 శాతం అని చెప్పుకుంటుంది కేంద్రం. సోషల్ డిస్టెన్ కోసం మద్య బెర్తులో కేటాయించడం ఆపిన కారణం, కరోనా కట్టడి కోసం డిస్ ఇన్ ఫెక్ట్ చేసిన ఖర్చు, కూలీకు అందించే మంచి నీల్లు, ఆహరం, ప్రత్యేక రైల్లు ఏర్పాటు వంటి కారణాలతో టికెట్ల రేట్లను అమాంతం పెంచి..అందులో 85 శాతాన్ని రిబేట్ చేస్తున్నామని చెప్పడం చూస్తే దసారా షాపింగ్ లో రేటు రెట్టింపు చేసి 50 శాతం డిస్కౌంట్ ఇచ్చినట్లుంది. అపడయ్యా మీ చావు తెలివి తేటలు. కూలీల మీద దయ చూపండి. టికెట్లు కొనుక్కొలేక ఇంటి నుంచి తిరిగి డబ్బులు పంపమని అడగాల్సి వస్తుంది. కూలీ నాలీ చేసి ఇంటికి డబ్బులు పంపించే మనుషులు, తిరిగి ఇంటి నుంచి వచ్చే డబ్బుల మీదే ఆదారపడటం చూస్తే…కూలీల దయనీయత అర్ధం అవుతోంది.