ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ కలిసిన సంగతి తెలిసిందే. అయితే వీరి భేటీపై ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం ఇన్వాల్వ్ అయ్యాయి.
అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తాజాగా జగన్ సినీ హీరోల భేటీ పై సీనియర్ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సీఎంతో భేటీ అభినందనీయమన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తులు, సుహృద్భావ పరిష్కారాలు, తీర్మానాలు అధికారికంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించబడిన తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబిస్తూ… ప్రభుత్వం అలాగే ప్రజల గౌరవాన్ని పొందడం గురించి ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో ఓ వర్క్ షాప్ అవసరమని అన్నారు. దీనిని త్వరలో ఆశిస్తున్నాము అంటూ నరేష్ ట్వీట్ చేశారు.
ఇక చిరు భేటీ తర్వాత మోహన్ బాబు పేర్ని నాని ని ఇంటికి ఆహ్వానించారు. పేర్ని నాని తో దిగిన ఫోటో ని కూడా మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.