ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వైరల్ అయిన విషయం, సంచలనం అయిన విషయాల్లో ఒకటి సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం. వీళ్ళు ఇద్దరూ ఈ వయసులో అలా చేయడాన్ని జనాలు కాస్త జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. న్యూ ఇయర్ కానుకగా ఈ ఇద్దరూ విడుదల చేసిన ఒక వీడియో కూడా వివాదాస్పదం అయింది. అందులో లిప్ లాక్ తో కనిపించారు ఈ ఇద్దరూ.
ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నరేష్ కి తనకు ఉన్న ఏజ్ గ్యాప్ గురించి ఆమె చెప్పారు. ఆ ఏజ్ గ్యాప్ భారీగా ఉందని కాని నరేష్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని ఆమె అన్నారు. ఇక విజయ నిర్మలతో తనకు ఉన్న అనుబంధం గురించి కూడా ఆమె చెప్పారు.
ఇదిలా ఇంచితే ఇప్పుడు నరేష్ నుంచి తనకు రావాల్సిన భరణం గురించి కూడా ఆమె మాట్లాడారు. దాదాపుగా విడాకులు ఇస్తే 20 కోట్లకు పైగా నరేష్ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు. నరేష్ ఆ రేంజ్ లో ఆఫర్ చేసినా సరే తాను రిజెక్ట్ చేసాను అని అన్నారు. ఇక నరేష్ పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఇద్దరూ వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు.