వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
11 మంది విద్యార్థులను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వారికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. మిగితా విద్యార్థులకు వైద్యం అందించి పాఠశాలకి పంపించారు. వైరల్ ఫీవర్, వాంతులతో విద్యార్థులకు అస్వస్థతకు గురయినట్లు వైద్యులు తెలిపారు.
స్టూడెంట్స్ వైరల్ ఫీవర్ తో రెండు రోజుల నుండి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దానివల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. అయితే.. ఫుడ్ పాయిజన్ వల్లే ఇది జరిగింది అంటూ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.