నరసాపురం : పశ్చిమగోదావరి అంటేనే పవన్‌కల్యాణ్ పుట్టిన జిల్లా. అక్కడ జనసేనానికి ఊరూరా అభిమానులు వుంటారు. వారంతా కలిసి పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటుంటే ఆపాలని ప్రయత్నిస్తే ఊరుకుంటారా? రచ్చరచ్చ చేశారు. పవర్‌స్టార్ సొంతఊళ్లో జరిగింది ఇది. పవన్ అభిమానులు తలపెట్టిన పుట్టినరోజు వేడుకల్నిపోలీసులు అడ్డుకోవడంతో మొదలైన గొడవ చివరికి లాఠీఛార్జికి దారితీసింది. వైఎన్ కాలేజీ దగ్గర పవర్‌స్టార్ ఫాన్స్ ఈ వేడుకలు ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నారు. దానికి పోలీసులు కుదరదని చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగారు. విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు గొడవ చేయడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. కొంతమంది విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » పవర్‌స్టార్ ఫాన్స్‌పై లేచిన లాఠీ