అమెరికన్ స్పేస్ ఏజెన్సీ తన సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రం నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఉన్న గ్రహం ఇంద్రధనస్సు రంగులను అద్దుకొని చూపరులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ అది ఏ గ్రహామో తెలుసా..ఫ్లూటో..!!
ఈ ఫొటోలో ఫ్లూటో గ్రహం విశ్వంలో ఉన్న రంగులన్నింటిని తనకు ఆపాదించుకున్నట్లు కనపడుతోంది.
ఇందులో ఫ్లూటో విభిన్న ప్రాంతాల మధ్య అనేక సూక్ష్మమైన రంగుల వ్యత్యాసాలను హైలైట్ చేయడానికి న్యూ హారిజన్స్ శాస్త్రవేత్తలు రూపొందించారని నాసా పోస్ట్‌లో పేర్కొంది.
ఈ చిత్రం యూరోప్‌లోని గంభీరమైన పర్వతాలను తలపించేలా, సంక్లిష్టమైన, వైవిధ్యమైన ఉపరితలం, చెక్కిన కొండలు, మృదువైన మంచుతో నిండిన మైదానాలు, భారీగా గుంతలతో కూడిన భూభాగం, గాలికి ఎగిసిపడే దిబ్బలను తలపించేలా ఉన్నట్లు నాసా పేర్కొంది.
అయితే నాసా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఒక్కరోజులోనే 7.8 లక్షల లైక్‌లు వచ్చాయి. ప్లూటో అందం, స్పేస్ ఏజెన్సీ వర్తించే కలర్ కాంబినేషన్‌ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. ‘ఓహ్ మై గాడ్’.. ఇది చాలా అందంగా ఉంది అని ఓ నెటిజన్ రాశారు. మరొకరు.. “ప్లూటో బయటకు వచ్చినట్లుగా ఉంది అంటూ పేర్కొన్నారు.