నటాషా పూనావాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ ప్రముఖ ఫ్యాషన్ షో జరిగినా అక్కడ వాలిపోతుంటుంది. ఎవరి ఊహకు అందని డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి అద్భుతమైన డ్రెస్ తో ఆకట్టుకుంది.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మెట్ గాలా-2022 ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో నటాషా ఇండియన్ శారీ అవుట్ ఫిట్ లో అందర్నీ షాక్ కు గురి చేసింది. మెటాలిక్ కలర్ లో ధగధగ మెరిసిపోతున్న ఆమె చీర, ఇతర కాస్టూమ్స్ బాగా ఇంప్రెస్ చేశాయి.
బంగారు ఆభరణాలు, చెవి రింగులు, గాజులతో నటాషా దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా అనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వెరైటీ చీరను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు.
ప్రస్తుతం నటాషా ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ చీర ఎంతో అద్భుతంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ గా పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఈ నటాషా ఎవరంటే.. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను తయారుచేసిన సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో ఆధార్ పూనావాలా భార్య.