కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలునివ్వగా… దేశవ్యాప్తంగా 20కి పైగా రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. కేంద్రం తీరుకు నిరసనగా దేశంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతుండగా, ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు బంద్ కు సపోర్ట్ చేస్తున్నాయి.
అయితే, తెలంగాణలో బంద్ కు టీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు, జన సమితి సహా పలు ప్రజా సంఘాలు తెలంగాణలో బంద్ పాటిస్తున్నాయి. లారీ సంఘాలన్నీ ఇప్పటికే బంద్ కు మద్ధతు తెలియజేశాయి. తెల్లవారుజాము నుండే బస్ డిపోల వద్ద అఖిలపక్ష నాయకులు బంద్ పాటిస్తున్నారు. డిపోలో నుండి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ మాత్రం బస్సులు నడుపుతామంటూ ప్రకటన చేసింది.
గత భారత్ బంద్ నాడు మంత్రులను సైతం రోడ్డు మీదకు పంపి నిరసన వ్యక్తం చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అఖిలపక్ష నాయకులు మండిపడుతున్నారు.