దేశంలో పాఠశాలకు వెళ్లే విద్యార్ధులపై నేషల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్‌ఏఎస్)-2021 సర్వే నిర్వహించింది. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 48 శాతం మంది పిల్లలు కాలినడకన పాఠశాలలకు వెళ్తున్నట్టు నిర్ధారించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి.. 720 జిల్లాల్లోని 1.18 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ సర్వే 3, 5, 8, 10 తరగతి విద్యార్థులు అభ్యసన సామార్థ్యాలపైన ఈ సర్వే నిర్వహించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. అయితే.. విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలు జాతీయ సగటుతో పోల్చితే.. రాష్ట్రంలోని రెండు, మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామార్థ్యాలు తక్కువగా ఉన్నాయని తేలిందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 18 శాతం మంది విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తున్నారని ఎన్‌ఏఎస్ పేర్కొంది. పాఠశాలల్లో బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో 9 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూల్ బస్సులను ఎంచుకుంటున్నారని వివరించింది.
మరో 8 శాతం మంది విద్యార్థులు మాత్రం తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటే.. 3 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు ఫోర్ వీలర్లలో వస్తున్నట్లు సర్వే ఘనాంకాలు చెప్తున్నాయి. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేసిన తర్వాత 78 శాతం మంది ఆన్‌లైన్ తరగతులకు ఆసక్తి చూపించలేదని.. 80 శాతం మంది విద్యార్థులు పాఠశాలలోనైతెనే బాగా నేర్చుకుంటున్నారని నివేదికలో తెలిపింది ఎన్‌ఏఎస్.