తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు నాలుగు అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులు వరించాయి.
సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. సంధ్యారాజ్ నిర్మించిన నాట్యం చిత్రానికి రెండు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
నాట్యం చిత్రానికి గాను బెస్ట్ కొరియోగ్రఫి అవార్డు సంధ్యా రాజ్ కు వచ్చింది. మేకప్ విభాగంలో ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా టీవీ రాంబాబు ఎంపికయ్యారు.
‘అల వైకుంఠపురములో’ చిత్రం ఉత్తమ సంగీత చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ కు అవార్డు లభించింది.