వర్షాలు కురవాలని గ్రామాల్లో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలో ఓ వింత ఆచారం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. దమోహ్ జిల్లా బనియా అనే గ్రామంలో వర్షాలు పడటం లేదని… వర్షాలు కురవటం కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు.
అవును… వర్షాలు కురవటం కోసం ఓ కట్టెకు కప్పను కట్టి, ఆ గ్రామంలో ఉన్న కొందరు బాలికలను నగ్నంగా ఆ కట్టెను పట్టుకోమని చెప్పి ఊరంతా తిప్పారు. అలా ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు వైరల్ గా మారటంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించింది.