ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ వివరణ కోరింది.
ఈ మేరకు ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తమిళిసై గౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది.
ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయన్ని కమిషన్ ఆదేశించింది. ఈ నెల 21న ఉదయం 11:30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.
కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. ఈ నెల 14న కమిషన్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.