కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజూ ఈడీ ఎదటు విచారణకు హాజరయ్యారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఈడీ తీరుపై రెండో రోజు నిరసనలు కొనసాగించారు.
నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమ నిరసనలు కొనసాగుతాయని కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తెలిపారు. బీజేపీ నాయకులు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణేలకు వ్యతిరేకంగా నమోదైన ఈడీ కేసులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పొలీసుల చర్యను రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు.