కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) తాజాగా మరోసారి సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి జూన్ 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం వేరే దేశానికి వచ్చానని, భారత్ కు రాగానే ఈడీ ఎదుట హాజరవుతానని ఈడీకి తెలిపారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి తాజాగా మరోసారి సమన్లు పంపింది. ఇక ఇదే కేసులో ఈ నెల 8న ఈడీ ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెకు గురువారం కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా వచ్చినప్పటికీ ఈడీ ఎదుట ఆమె హాజరవుతానని, దర్యాప్తునకు సహకరిస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం ట్వీట్ చేశారు.