కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ కోరడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు.
ఆయనతో పాటు ఆయన తమ్ముడు సురేష్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలని ఈడీ కోరడంతో తాను భారత్ జోడో యాత్రను మధ్యలోనే వదిలి వచ్చానని ఆయన అన్నారు.
యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన విరాళాలకు సంబంధించి వారిద్దరని ఈడీ విచారిస్తోంది. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర జరుగుతోంని, ఆ టైమ్ లో ఈడీ నోటీసులు పంపిందన్నారు.
దీంతో విచారణకు హాజరుకావడానికి తనకు మరింత సమయం కావాలని కోరినా ఈడీ పట్టించుకోలేదన్నారు. గత నెల 19న డీకే శివకుమార్‌ను దాదాపు 5 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.