సీనీయర్ జర్నలిస్ట్, టీవీ9 వ్యవస్థాపక సీఈవో అరెస్ట్‌పై జాతీయ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అంతర్జాతీయ జర్నలిస్ట్ సంఘాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీరు, పోలీస్ చర్యలపై మండిపడుతోంది. రవిప్రకాశ్‌ను వెంటనే విడుదల చేయాలని అంతర్జాతీయ జర్నలిస్ట్ పరిరక్షణ కమిటి-సీపీజే రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ… న్యూస్ ల్యాండ్రీ.కామ్ కథనాన్ని ప్రచురించింది.
తొలివెలుగు వెబ్‌సైట్ వ్యవపస్థాపకులు, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్ చేయటం పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా అభివర్ణించింది. చీటింగ్ కేసులు, ఫోర్జరీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఖండించింది.
తొలివెలుగు వెబ్‌సైట్‌లో వచ్చిన రెండు పరిశోధానత్మక ఇంటర్వ్యూలను తొలిగించేందుకు రవిప్రకాశ్ నిరాకరించటంతో… అరెస్ట్ చేశారని, ప్రభుత్వం వెంటనే రవిప్రకాశ్‌ను విడుదల చేయాలని సీపీజే ఆసియా కోఆర్డినేటర్ స్టీవేన్ బట్లర్ డిమాండ్ చేశారని తెలిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డిలకు సంబంధించిన అవినీతికి సంబంధించిన వీడియోలు తీయనందుకే ఈ అరెస్ట్‌లంటూ వివిధ సంస్థల కథనాలను కోట్ చేశాయి.
అసలు న్యూస్‌ల్యాండ్రీ.కామ్ ఏం రాసిందో తొలివెలుగులో యాధాతధంగా…
https://www.newslaundry.com/shorts/cpj-calls-for-release-of-journalist-ravi-prakash-telangana