ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక నూతన ఒరవడికి మార్గదర్శకుడైన ప్రముఖ జర్నలిస్ట్, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్టుపై జాతీయ మీడియా దిగ్గజాలు తీవ్రంగా స్పందించాయి. రవిప్రకాష్ అరెస్టు అక్రమమని జాతీయ మీడియా దిగ్గజాలైన ప్రముఖ జర్నలిస్టులు తప్పు పడుతున్నారు. ఇది మీడియా గొంతు నొక్కేయడమేనని మండిపడుతున్నారు.
మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు, హైదరాబాద్ సిటీ పోలీసులు బనాయించిన అక్రమ కేసు అని జాతీయ జర్నలిస్టు వినోద్ కాప్రే ట్వీట్ చేశారు. రవిప్రకాష్ లైఫ్ సీరియస్ థ్రెట్‌లో ఉందని పేర్కొన్నారు.
డైరెక్టర్లకు బోనస్ ఇవ్వడం నేరమా? అని ప్రశ్నించారు. ఒక సీనియర్ జర్నలిస్టు లైఫ్ ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో జర్నలిస్టులు అందరూ, ఎడిటర్లు, రిపోర్టర్లు, జర్నలిస్టు సంఘాలు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్రమాన్ని ప్రశ్నించవలసిఉందని వినోద్ కాప్రీ ట్వీట్ చేశారు.
స్వాతి చతుర్వేది, మహేష్ లాంగా, రోహిణీ సింగ్ తదితరులు వినోద్ కాప్రె ట్వీట్‌కు ప్రతిస్పందించారు.