మల్కాజిగిరిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన అనుచరుల ఆగడాలపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. బుధవారం ఢిల్లీ నుంచి జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ అల్డర్ స్వయంగా హైదరాబాద్ రానున్నారు. బాధితులను కలిసి విచారించనున్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు కలిసి దళిత మహిళలని కులం పేరుతో దూషించడాన్ని దళిత సంఘాలు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. అంబేద్కర్ ఫోటోను కాళ్లతో తన్ని, అవమానించిన అంశంపై కూడా ఫిర్యాదు చేశాయి. ఇక ఆందోళనకు దిగిన దళిత మహిళలను అరెస్టు చేసి పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి వరకు ఉంచడాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. వీటన్నింటిపై బుధవారం విచారణ జరపనుంది.