ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతర మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లు అమ్మవార్ల గద్దెల దగ్గరకు చేరుకున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వనదేవతలకు బంగారం సమర్పించారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అని అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అందులో భాగంగా జాతరకు వచ్చిన భక్తులకు మాస్కులు పంపిణీ చేశారు సీతక్క. కరోనా జాగ్రత్తలను పాటించాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని అన్నారు.