టెక్నాలజీ మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. నేడు ఆర్థికాభివృద్ధిలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు టెక్నాలజీ అంటే కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. ఈ ఆధునిక యుగంలో సాంకేతికత సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఎన్నో పనుల కోసం టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన జీవితాలను టెక్నాలజీకి అంకితమిచ్చాము. ఇప్పుడు పలు గ్యాడ్జెట్స్ మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి.
ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఆ విధానం మారిపోయింది. ఇప్పుడు సినిమాలు మొదలు ఆన్ లైన్ షాపింగ్ వరకు ఎన్నో అవసరాలను స్మార్ట్ మొబైల్ తీరుస్తోంది. అందుకే స్మార్ట్ ఫోన్ వచ్చాక పలు వస్తులు మనుగడలోకి లేకుండా పోయాయి.
ఆ తర్వాత వియరేబుల్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. ఫిటెనెస్ తో పాటు హార్ట్ బీట్, కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ లాంటి ఎన్నో సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ల్యాప్ టాప్ లు వచ్చాక కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ లాంటివి వచ్చాక దీన్ని ప్రాముఖ్యత తగ్గిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలులోకి రావడంతో దాని ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.
అలెక్సా, సిరి లాంటివి అందుబాటులోకి వచ్చాక మన జీవితంలో టెక్నాలజీ ప్రాముఖ్యత మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గృహాల్లో వర్చువల్ సహాయకులు సేవలు అందిస్తున్నాయి. దీంతో బల్బులు, ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు స్మార్ట్‌గా మారుతున్నాయి