దిశ హత్యాచారంతో దేశం మరోసారి ఉలిక్కి పడింది. నిర్భయ ఘటన తర్వాత వచ్చిన ఉద్యమంతో చట్టాలు అయితే వచ్చాయి కానీ అవి పూర్తిస్థాయిలో ఆచరణలోకి మాత్రం రాలేకపోతున్నాయి. స్వయంగా నిర్భయ నిందితులకే ఇంతవరకు శిక్షలు పడలేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు.
4 రోజుల క్రితమే ఎన్ కౌంటర్ స్క్రిప్ట్..!?
అయితే, సామాన్యులతో పాటు చట్టాలు చేసే నేతలపై కూడా రేప్ కేసులున్నాయి. సామాన్యుల విషయంలో ఎన్‌కౌంటర్లు అంటూ హాడావిడి చేస్తున్నారు… ఎమ్మెల్యే కొడుకో, నేతల బంధువులో కాదు స్వయంగా ఎంపీలే రేప్ కేసులలో ఉన్నారు. మరీ వీరి సంగతేంటీ అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
ఎంతమందిని ఇలా ఎన్‌కౌంటర్ చేస్తారు: మంచు లక్ష్మి
ఉన్నావ్ నుండి హైదరాబాద్ వరకు ఎన్నో రేప్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ కేసులో సత్వర న్యాయం కోసం డిమాండ్ రావటంతో… ఎన్‌కౌంటర్లు జరిగాయి మరీ ఎంపీల విషయంలోనూ ఎంపీలను ఎన్‌కౌంటర్ చేస్తారా అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సినీ నటి మంచు లక్ష్మి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జాతీయ మీడియాలోనూ ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే…: సీపీ సజ్జనార్
ఏపీలో వైసీపీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్‌పై రేప్ కేసుంది. మరీ ఎంపీ మాధవ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ మీడియాలో రేప్ కేసులున్న ఎంపీలు వీరే అంటూ కథనాలు రావటంతో… ఇప్పుడు చర్చంతా ఎంపీ మాధవ్‌ను ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందా…? మాజీ పోలీస్ అధికారి కదా ఆయనకు ఎన్‌కౌంటర్ ముందు అన్నీ విషయాలు తెలుస్తాయి కదా… చేయగలరా ? ఇలా రకరకాల డిస్కషన్స్ కొనసాగుతున్నాయి.
కేసీఆర్ చేసిందేం లేదు..క్రెడిట్ సజ్జనార్ దే
అయితే, చట్టాలు చేయాల్సిన ఎంపీలే పలు రేప్ కేసులలో ఉంటే…ఇక మహిళా భద్రత కోసం వారు కఠిన చట్టాలకు ఎలా మద్దతిస్తారు అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.