ఈర్ష్యా అసూయలు మనిషికి కాకపోతే ఎవరికి ఉంటాయి. ఏవేవో దేశాల సినిమాలకు ఆస్కార్ అవార్డులు వచ్చాయని తెలిసి గొప్పగా ఫీల్ అవుతుంటాం. అలా మనకెందుకు రావని గోళ్ళు కొరుక్కుంటాం. జుట్టు పీక్కుంటాం. చెవులు కొరుక్కుంటాం.
ఇప్పుడు మనదేశానికీ ఓ అవకాశం వచ్చింది.నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు పట్టలేని ఆనందంతో పండగ చేసుకున్నాయి. నిజానికి బాలీవుడ్ కి ఇలాంటి అవార్డు దక్కినా మన తెలుగు రాష్ట్రాలు ఇలాగే వ్యవహరిస్తాయనడంలో సందేహం లేదు.
అది ఎందుకో తెలియదు…మొదట్నించీ బాలీవుడ్ పై గురి. వాళ్ళ సినిమాలే బావుంటాయని ఓ గుడ్డినమ్మకం. మరి బాలీవుడ్ కి అంతే అభిమానం మనసినిమాల మీద చూపిస్తుందా..!? కనీసం సాటి భారతీయ సినిమా అనే స్ఫృహ ఉందా అనే ప్రశ్నలకు సమాధానంగా స్పందనే కరువైంది.
బాలీవుడ్ మెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇది వరకు షారూక్ ఖాన్ తప్ప.మిగిలిన బాలీవుడ్ దిగ్గజాలుగా పేరు పొందిన హీరోలు ఎవ్వరూ స్పందించలేదు. సరికదా కొంతమంది ఆస్కార్ అవార్డు రావడాన్ని యద్దేవా చేస్తున్నారు.
భారతీయ సినిమా పరిశ్రమకు మార్చి 12 మరుపురాని రోజు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డుల్లో రెండు భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు వరించాయి.
ష్టార్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డులు వరించాయి. చాలాకాలం తర్వాత భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలువురి విమర్శలు అందుకున్నది. అయితే, ఇదే సమయంలో సినిమాకు వచ్చిన పాపులారిటీ, అవార్డులపై పలువురు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ రావడంపై ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ షాన్ ఏమని కామెంట్ చేశాడంటే.. ‘ఇండియాలో అవార్డులు మాత్రమే కొనవచ్చని నేను భావించాను. కానీ, ఆస్కార్ అవార్డులు అమ్ముడవడం చూస్తున్నాను! అంతా డబ్బుతోనే జరుగుతుంది. మన దగ్గర డబ్బుంటే ఏదైనా పొందవచ్చు’ అంటూ వ్యాఖానించాడు.
దాంతో సాన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నటి అనన్య ఛటర్జీ సైతం ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడంపై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘నాటు నాటు’ సాంగ్‌ను చూసి ఎందుకు గర్వపడాలి? నాకు అర్థం కావడం లేదు. ఈ పాట గురించి నిజంగా గర్వించాలా? మనం ఎక్కడికి వెళ్తున్నాం’ అంటూ కామెంట్ చేసింది.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరక్కిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రానికి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 15 పాటలతో పోటీపడి.. చివరకు అవార్డును గెలుచుకున్నది.
అందుకు ముందు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అందుకున్న చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఇంకా వేదికపై సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైఫ్ పర్ఫామెన్స్ కు స్టాండింగ్ ఒవేషన్‌ను దక్కింది.