ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ జోరు మీదున్న హీరో నాని. మినిమం గ్యారెంటీ హిట్ అని పేరున్న నాని… ప్రస్తుతం టక్ జగదీష్ మూవీ చేస్తున్నాడు. ఈ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి కానుండగా, వచ్చే నెల నుండి శ్యామ్ సింఘా రాయ్ మూవీ టీంతో జతకట్టనున్నాడు.
తాజాగా నాని ఆ తర్వాత సినిమా ప్రకటన వచ్చేసింది. నాని నటించబోయే ఈ 28వ సినిమాను బ్రోచేవారేవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కున్న ఈ మూవీలో హీరోయిన్ గా నజ్రీయా ఫదా నటించనుంది. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కించనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
v