ప్రముఖ నిర్మాత దిల్ రాజు న్యాచురల్ స్టార్ నాని ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
అయితే ఇది కూడా దిల్ రాజు ప్రమేయంతోనే జరిగిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పట్ల నాని దిల్ రాజు పై గరం గరంగా ఉన్నాడట.