న్యాచురల్ స్టార్ నాని హిట్ ప్లాప్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 13న ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
బ్లూ టీ షర్ట్ వైట్ జీన్స్ ప్యాంట్ లో నాని కనిపించగా నీలి రంగు పంజాబీ డ్రెస్ లో ఓ బండ వైపు కూర్చొని రీతువర్మ కనిపించింది. ఇక ఈ సినిమాలో ఆమెతో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తోంది జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.