హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా తో పాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు నాని తన 28వ సినిమాను కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా నజ్రియా నటిస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. అంటే సుందరానికి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. సుందరానికి తొందరెక్కువ అనే పదం నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నారని తెలుస్తోంది.