సంవత్సరానికి కనీసం మూడు సినిమాలతో అభిమానులను అలరించే హీరో నాని. తెలుగులో ఇంత స్పీడ్ తో సినిమాలు చేస్తున్న ఏకైక హీరో. తాజాగా ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఓ వెబ్ సిరీస్ కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా సాగుతున్న చర్చలకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ చేస్తున్న నాని, ఆ తర్వాత అంటే సుందరికీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ మొదలుకానుంది.
నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ చేస్తున్నాడు. ఈ నెల నుండే శ్యామ్ సింగ రాఘ్ మొదలుకానుండగా వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ అవుతుంది. క్రిస్టమస్ నాటికి అంటే సుందరికీ కూడా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. వెబ్ సిరీస్ కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.