కరోనా కారణంగా దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎంతో మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. సినీ ఇండస్ట్రీలో సైతం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనితో సినీస్టార్స్ కరోనాపై అవగాహన కల్పించటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా నివారణకు ప్లాస్మా దానం చెయ్యాలంటూ ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, లాంటి అగ్రహీరోలు సోషల్ మీడియా లో పిలుపునివ్వగా తాజాగా న్యాచురల్ స్టార్ నాని ప్లాస్మా దానం చెయ్యాలంటూ పిలుపునిచ్చారు.
నగర పోలీసు శాఖకు ఇచ్చిన ప్రోమోలో కరోనా రికవరీ పేషెంట్స్ ప్లాస్మా డొనేట్ చేయాలని కోరాడు. అందరూ ముందుకొచ్చి ప్లాస్మా దానం చేస్తే అందరికీ మంచిదని చెప్పుకొచ్చాడు.
Donate plasma .. Please.
Small effort can save lives 🙏🏼 https://t.co/wuB5ayuhSs— Nani (@NameisNani) August 3, 2020