తెలంగాణ యాస‌తో రాబోతున్న హీరో నాని - Tolivelugu

తెలంగాణ యాస‌తో రాబోతున్న హీరో నాని

న్యాచుర‌ల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌కు సైన్ చేసిన నాని, తాజాగా మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన శ్రీ‌కాంత్ తొలి సినిమా నానితో చేయ‌నున్నాడు. ఈ సినిమాను సుకుమార్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్… సుకుమార్ రైటింగ్స్ ప‌తాకంపై నిర్మించ‌నున్నారు.

ఇప్ప‌టికే క‌థ విని ఇంప్రెస్ అయిన నాని… ఈ సినిమాలో తెలంగాణ యాస‌లో న‌టించ‌బోతున్నాడు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌టంతో నాని తెలంగాణ యాస‌లోనే న‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికే కృష్ణార్జున యుద్ధం సినిమాలో రాయ‌ల‌సీమ యాస‌తో ఆద‌ర‌గొట్టిన నాని… ట‌క్ జ‌గ‌దీష్ సినిమా గోదావరి జిల్లాల యాస‌తో రాబోతున్నాడు. ఆ త‌ర్వాత తెలంగాణ యాస సినిమా అన‌గానే ఫిలింన‌గ‌ర్ లో ఉత్కంఠ నెల‌కొంది.

ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ సినిమా చేస్తున్న నాని… ఆ త‌ర్వాత రాహుల్ సంక్రీత్య‌న్, వివేక్ ఆత్రేయ‌తో సినిమాలకు ఓకే చెప్పాడు. ఆ త‌ర్వాత శ్రీ‌కాంత్ తో సినిమా ఉంటుంది. వ‌చ్చే సంవ‌త్స‌రంలో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకు ప‌డిప‌డి లేచే మ‌నసు నిర్మాత సుధాక‌ర్ చెఱుకూరి నిర్మించ‌నున్నాడు.

Share on facebook
Share on twitter
Share on whatsapp