ప్రస్తుతం భారత్ లో స్వాతంత్ర్ కా అమృతోత్సవ్ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అది ఏంటంటే ‘మూమెంట్స్ విత్ తిరంగా’ పేరుతో ప్రకృతిలో ఏర్పడిన జెండా రంగుల చిత్రాలను పంపాల్సిందిగా పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా భారతీయ జెండా రంగులతో రూపొందుతున్న చిత్రాన్ని కేంద్రం ఆదివారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. సంజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి పంపిన ఫొటో తో “ప్రకృతి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తోంది”
దీనిని చూసిన ట్విటర్ ఖాతాదారులు చిత్రం పై స్పందించారు. “ఝండా ఊంచా రహే హమారాష అంటూ తమ కామెంట్లను తెలుపుతున్నారు. ఈ చిత్రంలో ఆకాశంలో సూర్యుడు, మధ్యన సముద్రుడు, పక్కన పచ్చని ప్రదేశం… అన్నీ కలిసి జాతీయ పతాకాన్ని రూపొందించాయి.
చూడాటానికి ఈ చిత్రం ప్రకృతి ఏర్పరిచిన జాతీయ జెండాలగా కనువిందు చేస్తుంది.