టాలీవుడ్ పై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఐటి అధికారులు అనంతరం నాని, వెంకటేష్, ఇల్లు కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేశారు. అయితే ఐటీ అధికారుల దాడుల పై యంగ్ హీరో నవదీప్ ఫన్నీ కామెంట్ చేశాడు.
ఐటీ అధికారులు నా మీద దాడి చేసిన బాగుండు, ఒకవేళ నా మీద దాడి చేస్తే తిరిగి అధికారులే నాకు కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు బిల్ బ్యాండ్ బాజా అనే హ్యాష్ ట్యాగ్ కూడా తన జత చేశాడు నవదీప్.