భీమ్లానాయక్ చిత్రంతో హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొత్త సినిమాల చిత్రీకరణపై దృష్టి సారించారు. అందుకు తగ్గట్టు స్పీడ్ పెంచారు పవన్. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది.
తజాగా.. శ్రీరామనవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. పవన్ కళ్యాణ్ స్వయంగా శ్రీరాముడి పటానికి పూజా చేసి, హారతి ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడవి వైరల్ గా మారాయి.
ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేముందు స్వామివారి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ”ఈ పవిత్రమైన శ్రీరామనవమిని శౌర్యానికి, పుణ్యానికి ప్రతీకగా జరుపుకుందాం” అంటూ సినిమాకు సంబంధిన ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్.
క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ దొంగ పాత్రలో నటించగా.. నిధి అగర్వాల్ సరసన కథానాయికగా నటించనుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదును పెడుతున్నారు.