ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడ్నే హత్య చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహర కృష్ణ. నిందితుని ప్రేయసి, హత్య కేసులో మూడవ నిందితురాలైన నిహారిక రెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ క్రమంలో మృతుడు నవీన్ కుటుంబ సభ్యులు డీసీపీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు.
హత్యకు ప్రధాన కారణమైనటువంటి నిందితురాలు నిహారిక అని వారు ఆరోపిస్తున్నారు. హత్య చేసి వచ్చిన ప్రధాన నిందితునికి సాయం చేయడంతో పాటు అతనికి 1500 డబ్బులు కూడా ఇచ్చిన ఆమెకు ఇంత త్వరగా బెయిల్ ఎలా వచ్చిందని వారు ప్రశ్నించారు.
ఈ కేసులోని నిందితులను వెంటనే ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెకు కేవలం 12 రోజుల్లో ఎలా బెయిల్ ఎలా వచ్చిందంటూ వారు నిలదీశారు.
అసలు ఇంత త్వరగా బెయిల్ రావడానికి ఆమె మీద పెట్టిన సెక్షన్ ఏంటి అనేది కూడా తమకు తెలపాలని వారు కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ డీసీపీ ఆఫీసు ముందు బైఠాయించారు.