మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం పాటియాలలోని రాజేంద్ర ఆస్పత్రికి తరలించారు.
సిద్దూ తరఫున న్యాయవాది మాట్లాడుతూ… జైలులో స్పెషల్ డైట్ ఇవ్వాలని సిద్దూ కోరినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు బోర్డ్ ఆఫ్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆయకు ఎలాంటి డైట్ ఇవ్వాలనే అంశంపై పూర్తి నివేదికను కోర్టుకు వైద్యులు సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. గోధుమ, చెక్కెర, మైదాపిండితో తయారు చేసిన పదార్థాలు తినవద్దని వైద్యులు సూచించినట్టు ఆయన పేర్కొన్నారు.
1998 నాటి రోడ్డు ప్రమాదం కేసులో సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. దీంతో ఆయనను పాటియాలా సైంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.