పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవ్ జోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షులు కోరినట్లు తను తన రాజీనామాను పంపినట్టు ట్వీట్ లో ఆయన తెలిపారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాలను చవిచూసింది. పార్టీ ఓటమి గల కారణాలపై సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఓటమి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు తప్పుకోవాలని ఆమె ఆదేశించారు.